కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ.. రాజీనామ

హైదరాబాద్, 28 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): 40 యేండ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే పంగ నామాలు పెట్టారు అంటూ గొట్టిముక్కల వెంగల్ రావు ఆందోళన.

అది టీపీసీసీ కాదు అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని టిటిడిపి. దశాబ్దాల నుండి పార్టీలో ఉన్నవారికి కనీస గుర్తింపు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో లేదు. కార్యకర్తలుగా జెండా పట్టిన వారికి కనీస గుర్తింపు లేదు.

కష్టకాలంలో అండగా ఉంటే ఇదేనా మాకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్. మమ్ములను నమ్ముకున్న క్యాడర్ ను నట్టేటా ముంచారు.

కొత్తగా వచ్చిన వారికి పార్టీలో అందలం ఎక్కించారు. రేవంత్ రెడ్డి ఆయనకు నచ్చిన వారికి ..ఆయనలాగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి మాలాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులకు మొండి చేయి చూపారు.

గతంలో కాంగ్రెస్ అంటే నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మకం: గొట్టిముక్కల వెంగళరావు

Post a Comment

Previous Post Next Post