చికెన్‌ బిర్యానీ 140, మటన్ బిర్యానీ 180

• అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ఖరారు

• గరిష్ఠంగా చేయాల్సిన వ్యయం 40 లక్షలే..

• జాబితా విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి 

సిరిసిల్ల 31, అక్టోబర్ 2023

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార ఖర్చులను ఎన్నికల అధికారులు ఖరారు చేసింది.

 కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
 దేనికి ఎంత వ్యయం చేయాలో సూచించింది. 

అభ్యర్థులు గతంలో తమ ఖర్చులను తక్కువగా చూపించే వారు. ఈ సారి ఎన్నికల అధికారులే ధరల జాబితాను రెడీ చేశారు. దాని ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించనున్నారు. నీళ్ల ప్యాకెట్‌ నుంచి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌, బెలూన్స్‌, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు. ఈసారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఈసీ పెంచింది. అభ్యర్థి ఖర్చుల వ్యయం గరిష్ఠంగా రూ.28 లక్షలు ఉండగా, దానిని ఈసారి రూ.40 లక్షలు చేసింది.

Post a Comment

Previous Post Next Post